No Ball వివాదం.. కోహ్లి కోరగానే నో బాల్ ఇచ్చారా..?

-

T20 World cup 20222 : టి – 20 మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయంం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా టార్గెట్ ను చేరుకుంది. మ్యాచ్ అధ్యంతం నరాలు తెగే ఉత్కంఠగా కొనసాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


అయితే ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో వచ్చిన నోబాల్ పై వివాదం చెలరేగుతుంది. 20 ఓవర్ పాక్ బౌలర్ నవాజ్ వేశాడు. అయితే నవాజ్ వేసిన నాలుగో బంతి నోబెల్ కావడంతో ఈ రచ్చ మొదలైంది. ఈ నాలుగో బంతిని కోహ్లీ సిక్స్ కొట్టాడు. కోహ్లీ క్రీజ్ బయట ఉన్నాడని దాన్ని నో బాల్ ఎలా ఇస్తారని, ఫ్రీ హిట్ బాల్ కు 3 పరుగులు ఎలా తీస్తారని పాకిస్తాన్ ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం కోహ్లీ సిక్స్ కొట్టింది కూడా కచ్చితంగా నో బాలే. ఎందుకంటే అది కోహ్లీ నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఇంకా కోహ్లీ కాలు క్రీజులోనే ఉంది. ఇక ఆ ఫ్రీ హిట్ బాల్ కు కోహ్లీ బోల్డ్ అయినా, మూడు పరుగులు తీయవచ్చు అని ఐసిసి రూల్స్ చెబుతున్నాయి. కానీ పాక్ ప్లేయర్లు అలాగే ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వెలగక్కుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news