ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరటి పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. భారత్ జోడో యాత్రలో భాగంగా.. కర్ణాటక నుంచి నిన్న ఉదయమే తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ.. ఢిల్లీకి పయనవయ్యారు. యాత్రకు మూడు రోజులు విరామం ప్రకటించిన రాహుల్ గాంధీ.. తిరిగి ఈ నెల 27న తెలంగాణలో పాదయాత్రను ప్రారంభిస్తారు. అయితే.. పాదయాత్రలో భాగంగా.. కృష్ణా నది బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మక్తల్‌లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ.. సుమారు 5 కిలోమీటర్ల పాటు యాత్ర సాగించారు. అనంతరం.. మక్తల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. అక్కడ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే.. రాహుల్ మూడు రోజుల విరామం తీసుకున్నారు.
అయితే.. దీపావళి పండగ సందర్భంగానే జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. అయితే… ఇవాళ ఉదయం తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. భారత్ జోడో యాత్రకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రవేశించిన రాహుల్ గాంధీ.. పాదయాత్రలో భాగంగా.. దారి పొడవునా స్థానికులను పలకరిస్తూ ముందుకు సాగారు. అందరినీ తన చిరునవ్వుతో పలకరిస్తూ.. కుశల ప్రశ్నలు వేస్తూ.. క్షేమ సమాచారాలు, సమస్యలు అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర సాగించారు.