ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం మారలేదు. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,250గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,530గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,100 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 51,380గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,350గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,760గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 47,130గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,310గాను ఉంది. త్వరలోనే ఫెడరల్ రిజర్వు భేటీ కాబోతుంది. వచ్చే వారం ఈ భేటీకి ముహుర్తం. మార్కెట్లో బంగారం ధరల కదలిక ఇటీవల పూర్తిగా ఈ మీటింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది.
ఈ భేటీలో వెల్లడించే ప్రకటనలకు అనుగుణంగా బంగారం ధరలు ట్రేడవుతున్నాయి. ఈ భేటీ నేపథ్యంలో ముందస్తుగానే ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్‌తో గోల్డ్ ధరలు పడిపోయాయి. మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.507 తగ్గి రూ.50,230 వద్ద క్లోజైంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం బంగారం ధర 1.07 శాతం పడిపోయి ఔన్స్ 1,644 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు డౌన్ ట్రెండ్‌లో ఉండటంతో.. రిటైల్ మార్కెట్లో సైతం బంగారం ధరలు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. నేడు రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 వద్ద రికార్డయింది. బంగారం ధర స్థిరంగా ట్రేడవుతున్న ఈ సమయంలో.. వెండి రేట్లు పైకి ఎగిశాయి. కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.200 పెరగడంతో.. ఈ రేటు రూ.63,700కి చేరుకుంది.