నేను రాజీనామా చేయలేదు – బండి సంజయ్ క్లారిటీ

-

నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని బిజేపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారం చేయడంతో…. సోషల్ మీడియాలో బిజెపి వర్సెస్ టిఆర్ఎస్ గా వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఓ లెటర్ వైరల్ గా మారింది. అయితే ఆ లెటర్ పై స్వయంగా బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో విసుగు చెందిన టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు నకిలీ లేఖను విడుదల చేశారు. మునుగోడులో బీజేపీ రికార్డు విజయం సాధించడమే గాక టీఆర్‌ఎస్ నవంబర్ 3న అంతం అవుతుంది. ఇది కేసీఆర్ ప్రజా జీవితానికి నిజమైన రాజీనామాకు దారి తీస్తుంది. టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి. ఇందుకే ఇలా వ్యవహరిస్తోంది. తాను రాజీనామా చేయలేదు అని బండి సంజయ్ పేర్కొన్నారు.

https://twitter.com/bandisanjay_bjp/status/1587465689404964866?s=20&t=uw0abqLquPtx7D_YVnYl-g

Read more RELATED
Recommended to you

Latest news