మునుగోడు ఊప ఎన్నిక ఫలితాలు వన్ సైడ్ గా కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్ నుండి 12 రౌండ్ వరకు టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మునుగోడులో ఆదిక్యం కొనసాగిస్తుంది. మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లు లోను టిఆర్ఎస్ ముందంజలో ఉంది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆదిక్యంలో కొనసాగుతున్నారు. మునుగోడు బైపోల్ 12వ రౌండ్ లో కూడా కారు పార్టీ అధికారంలో నిలిచింది. 12వ రౌండ్ ముగిసే సమయానికి 8000 ఓట్ల మెజారిటీలో టిఆర్ఎస్ ముందుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం దిశగా అవకాశం రాలేదు.
అయితే ప్రస్తుతం మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా మునుగోడును అష్టదిగ్బంధం చేసిందని.. డబ్బులు, మద్యం ఏరులై పారిందన్నారు. మునుగోడులో కౌరవ సైన్యం దిగి నన్ను ఓడించింది అన్నారు రాజగోపాల్ రెడ్డి. అయినప్పటికీ ప్రజల తీర్పుని గౌరవిస్తున్నానని తెలిపారు.