మునుగోడు కౌంటింగ్: కారుని కాపాడిన కమ్యూనిస్టులు..!

-

మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది..15 రౌండ్లలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నికలో..ప్రస్తుతం 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ లీడ్ 3923 ఓట్లు. అయితే ఇదేమి పెద్ద మెజారిటీ కాదు..ఇంకా ఆరు రౌండ్లు ఉన్నాయి. ఈ ఆరు రౌండ్లలో గాని బీజేపీ పుంజుకుంటే ఫలితం తారుమారయ్యేది.

అలా కాకుండా మిగతా రౌండ్లలో కూడా కారు పార్టీ లీడ్ సాధిస్తే…గెలుపు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మునుగోడులో బీజేపీ బలం ఏ మాత్రం లేదు..కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్లే..ఈ స్థాయిలో ఓట్లు పడుతున్నాయి..అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ వచ్చింది..కాంగ్రెస్ ఓట్లు పూర్తి స్థాయిలో కోమటిరెడ్డికి పడలేదు..దీని వల్ల రాజగోపాల్ కాస్త వెనుకబడి ఉన్నారు.

అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీలు కలిసొస్తున్నాయి. అనూహ్యంగా సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలతో పొత్తు పెట్టుకోవడం టీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చింది. ఎందుకంటే మునుగోడులో కమ్యూనిస్టుల ఓట్లు బాగానే ఉన్నాయి. ఐదు సార్లు సి‌పి‌ఐ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత పార్టీ బలం తగ్గిన కొంతమేర ఓటు బ్యాంక్ ఉంది. దాదాపు 15 వేల ఓట్లు వరకు సి‌పి‌ఐకి ఉంటాయి..ఇటు సి‌పి‌ఎంకి 5 వేల వరకు ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు పార్టీల ఓటు బ్యాంక్ టీఆర్ఎస్‌కు ప్లస్ అయింది. ఇప్పుడు 3923 ఓట్ల లీడ్ అంటే..అది కమ్యూనిస్టుల సాయం వల్లే జరిగిందని చెప్పొచ్చు. ఇంకా ఆరు రౌండ్లు ఉన్నాయి కాబట్టి మెజారిటీ పెద్దగా వచ్చే ఛాన్స్ లేదు. ఎంత మెజారిటీ వచ్చినా సరే అది కమ్యూనిస్టుల మద్ధతుతో వచ్చిన ఓట్లే అని చెప్పొచ్చు. మొత్తానికైతే కారు పార్టీని కమ్యూనిస్టులు కాపాడారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news