చంద్రగ్రహణం రోజు ఈ వస్తువులను దానం చేస్తే..ఆ దోషాలన్నీ తొలగిపోతాయి…!!

-

అమావాస్య,పౌర్ణమి నాడు గ్రహణాలు రావడం చూస్తూనే ఉన్నాము..అయితే ఈ ఏడాదిలో 15 రోజుల వ్యవధిలోనే సూర్యగ్రహణం చంద్రగ్రహణం రావడం గమనార్హం.అక్టోబర్ 25వ తేదీ సూర్యగ్రహణం ఏర్పడగా నవంబర్ 8వ తేదీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇలా 15 రోజుల వ్యవధిలోనే సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి. ఇక నవంబర్ 8వ తేదీ ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనపడగా మరికొన్ని ప్రాంతాలలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. ఇలాంటి గ్రహణ సమయాలలో మనం ఏదైనా దానధర్మాలను చేస్తే మనం పడే ఇబ్బందుల నుంచి దోషాల నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గ్రహణం ముందు రోజు మనం దానం చేయాలనుకున్న వస్తువులను బయటపెట్టి గ్రహణం మరుసటి రోజు ఆ వస్తువులను దానం చేయటం వల్ల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి చంద్ర గ్రహణ సమయంలో ఎలాంటి వస్తువులను దానం చేయాలి అనే విషయానికి వస్తే… ఉద్యోగ సమస్యలతో బాధపడేవారు తెల్లటి ముత్యాలను దానం చేయడం ఎంతో మంచిది. ఇలా ముత్యాలను కాకపోయినా ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలను దానం చేయడం మంచిది..

ఇకపోతే గ్రహణం తర్వాత అంటే రేపు తెల్లటి బియ్యం, చక్కెర,పాలు వంటి పదార్థాలను దానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోవడమే కాకుండా మన ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయి.ఇకపోతే మన ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉంటే కనుక ఆ అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడం కోసం ఒక గాజు గ్లాసులో వెండి నాణెం వేసి అందులో పాలు వేసి ఆ పాలను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి తాగించాలి. అనంతరం ఆ గిన్నెతో పాటు వెండి నాణెం కూడా దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇలా చంద్రగ్రహణ సమయంలో ఈ దానాలను చేయటం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news