చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటునాయి. అయితే మీకు కూడా ఇలా వుంది ఆధార్ దేనికి లింక్ అయ్యి ఉందొ తేలికపోతుంటే ఇలా చెయ్యండి. అన్ని అకౌంట్లకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. మనకు వుండే డాక్యుమెంట్స్ లో ఆధార్ కూడా ఒకటి.
ఆధార్ వలన చాలా లాభాలు వున్నాయి. అయితే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఆధార్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది తెలియదు. అప్పుడు ఇలా చెయ్యండి. ఇంట్లోనే ఉండి ఏ బ్యాంకుకు ఆధార్ లింక్ అయ్యిందో చూడచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సేవలని ఇస్తోంది. ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి మాత్రం ఉండాలి చూసుకోండి.
దీని కోసం మీరు ముందు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ని ఓపెన్ చేయండి.
ఇప్పుడు మీరు హోమ్ పేజీలో Aadhaar Services మీద క్లిక్ చేయండి.
ఆ తరవాత Check Aadhaar Bank Linking Status మీద నొక్కండి.
కొత్త పేజీ వస్తుంది ఇప్పుడు.
ఆధార్ నెంబర్ ని కానీ వర్చువల్ ఐడీ ని కానీ ఎంటర్ చేయండి.
మీరు ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. Send OTP పైన క్లిక్ చేయండి.
ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
ఇలా మీరు ఈజీగా ఆధార్ బ్యాంక్ ఖాతా తో లింక్ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది.