కంటెంట్ ఉన్న స్టోరీలతో తన ఫ్యాన్స్ ని ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుంటాడు కార్తీ. ఇటీవలే పొన్నియున్ సెల్వన్’, ‘సర్దార్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన కార్తీ.. సర్దార్ మూవీ స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో వచ్చాడు. జపాన్ అనే సినిమాను కార్తీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయగా, తాజాగా మరో అప్డేట్ ను ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రేపు అంటే నవంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ మురుగన్ దర్శకత్వం వహిస్తుండగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.