TTD : రేపు వర్చువల్‌ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

-

భక్తుల సౌకర్యార్థం డిసెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి వర్చువల్‌ ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఈ కోటా విడుదల చేయనున్నారు. ఇందులో శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన వర్చువల్‌ సేవ, సంబంధిత దర్శన టికెట్లు ఉంటాయి. ఇప్పటికే డిసెంబర్ నెలకు సంబంధించిన రూ. 300 దర్శన కోటాను టీటీడీ గత శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. దర్శన కోటా విడుదలైన 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు.

TTD scraps VIP darshan on weekends to accommodate common pilgrims

వాస్తవానికి, డిసెంబర్ నెల టికెట్ల కోటాను అక్టోబర్‌లోనే విడుదల చేయాల్సి ఉండగా.. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని డిసెంబర్‌ నుంచి మార్పు చేయాలని టీటీడీ నిర్ణయానికి రావడంతో స్లాట్ల సర్దుబాటులో భాగంగా జాప్యం జరిగింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా 5,06,600 టికెట్లను వివిధ స్లాట్లలో విడుదల చేయడం.. హాట్‌ కేకుల్లా అయిపోవడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news