వైర్లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రానున్న Google Pixel 7a స్మార్ట్‌ ఫోన్..!!

-

గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్‍కు సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్లను ఓ టిప్‍స్టర్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. వీటిని బట్టి చూస్తే.. పిక్సెల్ 6ఏతో పోలిస్తే 7ఏ భారీ అప్‍గ్రేడ్లతో వస్తుందని తెలుస్తోంది. పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో మొబైళ్లను దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలే లాంచ్ చేసింది. యూజర్ల నుంచి క్రిటిక్స్ వరకు అందరి మనసులను ఈ మోడల్స్ గెలుచుకున్నాయి. ఇప్పుడు ఇదే సిరీస్‍లో బడ్జెట్ మోడల్‍ను గూగుల్ రెడీ చేస్తోంది. గూగుల్ పిక్సెల్ 7ఏను రూపొందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 6ఏ (Google Pixel 6a) కు సక్సెసర్ గా ఇది రానుంది. వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో గూగుల్ పిక్సెల్ 7ఏ లాంచ్ కానుంది . అయితే ఇప్పుడు ఈ ఫోన్‍కు సంబంధించిన కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. అవి ఎలా ఉన్నాయంటే..

గూగుల్ పిక్సెల్ 7ఏ అంచనా స్పెసిఫికేషన్లు..

90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే 1080p సామ్‍సంగ్ ప్యానెల్‍తో గూగుల్ పిక్సెల్ 7ఏ డిస్‍ప్లే ఉండనుంది.
6ఏ కంటే 7ఏ డిస్‍ప్లే ఎంతో అప్‍గ్రేడ్ అవుతుందని భావించవచ్చు.
పిక్సెల్ 6ఏ స్టాండర్డ్ 60హెర్ట్జ్ రిఫ్రెష్‍ రేట్‍నే కలిగి ఉంది.
పిక్సెల్ 6ఏతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 7ఏ కెమెరా విభాగంలో భారీ అప్‍గ్రేడ్‍లతో వస్తుందని టిప్‍స్టర్ వెల్లడించారు. 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్787 సెన్సార్‍తో పిక్సెల్ 7ఏ ప్రైమరీ కెమెరా ఉంటుందని వెల్లడించారు. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుందని చెప్పారు. కాగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతో పిక్సెల్ 7ఏ కెమెరా విభాగంలో మరింత మెరుగ్గా ఉంటుందని టాక్‌.

వైర్లెస్‌ ఛార్జింగ్…

గూగుల్ పిక్సెల్ 7ఏ స్మార్ట్ ఫోన్ వెర్లెస్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుందని లీక్‍స్టర్ కుబా వెల్లడించారు. ఇదే జరిగితే, వెర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న మొట్టమొదటి పిక్సెల్ ఏ సిరీస్ ఫోన్ ఇదే అవుతుంది. అయితే ఈ వైర్లెస్ చార్జింగ్ స్పీడ్ 5వాట్‍గా ఉంటుందన్న అంచనాలు అయితే ఉన్నాయి…

గూగుల్ పిక్సెల్ 7ఏ లాంచ్‍కు ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. అప్పటికి..ఇప్పుడు ఉన్న స్పెసిఫికేషన్స్‌తో మార్పులు చేర్పులు జరగొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news