కుండపోత వర్షాలు … రెండు జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌

-

భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, నవంబర్ 20 (ఆదివారం) నుండి అండమాన్ మరియు నికోబార్ ద్వీపంలోని కొన్ని ప్రాంతాలలో మరియు తీరప్రాంత తమిళనాడు మరియు పుదుచ్చేరిలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 21న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 21న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. అల్పపీడనం శనివారం ఉదయం మరింత బలపడి రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Sudden rains lash Chennai; city comes to a standstill due to heavy  water-logging - The Hindu BusinessLine

వచ్చే ఆది, సోమవారాల్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, వేలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోతగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 21న కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇదే విధంగా ప్రైవేటు వాతావరణ పరిశోఽధకులు కూడా ఈ నెల 20 నుండి 22 వరకు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ అడమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాలపై తుఫాను ప్రసరణ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడటం ద్వారా తూర్పు తీరం వెంబడి రాబోయే వర్షం పూర్తి అవుతుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news