బద్రి మూవీ లో రేణూ పాటపై మొదటిసారి స్పందించిన పవన్ కళ్యాణ్.!

-

పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో బద్రి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ మీడియా, ఇంటర్వ్యూలకు కొంచెం దూరంగా ఉన్నారనే చెప్పాలి. అయితే బద్రి సినిమా సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి టెక్నికల్ సైడ్ మంచి నాలెడ్జ్ ఉంది. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫైట్స్, కంపోజిషన్ , డైరెక్షన్ స్టోరీ రైటింగ్ ఇలాంటి వాటిలో మంచి పట్టు ఉందని చెప్పవచ్చు.

పాటలలో కూడా తనకు స్పెషల్ టేస్ట్ ఉందని బద్రి సినిమా నుంచి వచ్చిన పాటలు వింటే మనకు అర్ధం అవుతుంది. ఈ సినిమా సమయంలో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మొదటిసారి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. ఒక పాటని సంగీతం, సాహిత్యం , కొరియోగ్రఫీ అని మూడు భాగాలుగా విడదీసి చూడలేను ..అసలు కంటెంట్ ఏంటి? ఆ పాట ద్వారా ఏం చెప్పబోతున్నాం అనేది గమనిస్తాను. ఈ మొబైల్ ఫీల్ బాగుంటే నాకే కాదు ఎవరికైనా ఆ పాట నచ్చుతుంది అంటూ సాంగ్స్ పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు.

కొరియోగ్రఫీ బేస్డ్ పాటల్లో చేయడం అనేది నా ఆలోచన తీరుకి నచ్చదు.. ఒక ఫీలింగ్ అనేది బిల్డ్ అవ్వాలనిపిస్తుంది . హీరో అయిన తర్వాత నేను చేసిన డ్యూయెట్స్ లో ఎంజాయ్ చేసింది అంటే బద్రి సినిమాలోని పాటలు.. ముఖ్యంగా ఏ చికిత, మిస్సమ్మ పాటలు అని చెప్పాలి. అయితే హీరో కాకముందు నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలాగే ఈ పాటలు కూడా చేయడం జరిగింది. ఇందులో రేణు దేశాయ్ నటించడం నాకు చాలా బాగా అనిపించింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news