హుస్నాబాద్ బస్టాండ్ లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. బస్టాండ్ పార్కింగ్ స్థలంలో ఆర్టీసీ సిబ్బంది నాటు బాంబులను గుర్తించారు. దీంతో వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఐదు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంకా ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది. దీని వెనుక ఎవరూ ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.