ఇదేం విడ్డూరం.. సోదాలు చేయగానే గుండె నొప్పి వస్తుందా..? : రఘునందన్ రావు

-

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. తన కుమారుడిని ఐటీ అధికారులు సీఆర్పీఎఫ్ దళాలతో కొట్టించారన్న మంత్రి వ్యాఖ్యలను ఎమ్మెల్యే తప్పుబట్టారు. చట్టానికి లోబడి పనిచేసే అధికారులు ఎవరిని కొట్టరని స్పష్టం చేశారు.

ఎవరికి నోటీసులు ఇచ్చినా గుండె నొప్పి అంటూ.. ఆస్పత్రికి వెళ్తున్నారని పరోక్షంగా మంత్రి కుమారుడిపై విమర్శలు గుప్పించారు. మల్లారెడ్డి కుమారుడు నిన్న ఉదయం కూడా వాకింగ్‌ చేశారు కదా.. నోటీసులు ఇవ్వగానే గుండె నొప్పి వస్తుందా అని ప్రశ్నించారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే.. ఐటీకి సమాచారం ఇచ్చారని తెలుస్తోందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమని ఎవరిని నోటీసులు ఇచ్చిన తప్పకుండా పాటించాలని రఘునందన్‌ రావు అన్నారు. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు.

“ఆరోగ్యం ఉన్న వ్యక్తులకు ఈడీ, ఐటీ నోటీసులు రాగానే గుండెనొప్పి ఎందుకు వస్తుందో నాకు అర్ధం కావడం లేదు. అసలు ఆ కేసులో మల్లారెడ్డి దగ్గర పనిచేసినవారే ఆయనతో విబేధించి వెళ్లినా వారే ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. అందులో భాగంగానే తనిఖీలు చేపట్టారు. అలా కాకుండా చెత్తబుట్టలో ఫోన్ దాచిపెట్టడం, ఫైల్స్ దాయడం చేస్తున్నారంటే మీరు తప్పు చేశారని అర్ధమవుతోంది. చట్టం ముందు అందరూ సమానమే. నాకు నోటీసులు వచ్చినా నేను వెళ్తాను.” – రఘునందన్‌ రావు, ఎమ్మెల్యే

Read more RELATED
Recommended to you

Latest news