తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది : పట్టాభిరాం

-

మరోసారి వైసీపీ నేతలపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన సంకల్పసిద్ధి ఈమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 1,100 కోట్ల భారీ స్కామ్ కు పాల్పడిందని పట్టాభిరాం ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ప్రధాన అనుచరుడు ఓలుపల్లి రంగా సహాయంతో గుత్తా వేణుగోపాల్ కృష్ణ, కిరణ్ అనే బినామీలను పెట్టుకుని ఈ సంస్థను స్థాపించారని చెప్పారు పట్టాభిరాం. రూ. 20 వేలు కడితే 10 నెలల్లో రూ. 60 వేలు ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని పట్టాభిరాం అన్నారు. బోగస్ కంపెనీ సంకల్పసిద్ధి రిజిస్టర్ అయిన తర్వాత వల్లభనేని వంశీ రెండు, మూడు నెలలు ఎందుకు మాయమయ్యారని పట్టాభి ప్రశ్నించారు.

TD leader Pattabhi Ram released on bail

కొట్టేసిన పేదల సొమ్మును దాచుకునేందుకు మాయమయ్యారా? అని అడిగారు పట్టాభిరాం. గన్నవరం నియోజకవర్గంతో పేదల ప్రాణాలు డయేరియాతో పోతున్నా వంశీ ఎందుకు కనపడలేదని పట్టాభిరాం ప్రశ్నించారు. పేదల సొమ్మును కొట్టేసిన నాని, వంశీలపై కేసులు నమోదు చేయడం ద్వారా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు పట్టాభిరాం. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి పత్రికలో ఎందుకు ప్రచురించలేదని ప్రశ్నించారు పట్టాభిరాం.

Read more RELATED
Recommended to you

Latest news