గేమ్ ప్లాన్ మార్చిన రేవంత్..ప్రియాంక లీడ్!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకునే అంత మచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతుందే తప్ప మెరుగు పడే పరిస్తితి కనిపించడం లేదు. సరే పి‌సి‌సి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చారు కదా..పార్టీకి ఊపు వస్తుందని అంతా అనుకున్నారు..అనుకున్న విధంగానే మొదటలో కాస్త ఊపు వచ్చింది..భారీ సభలు, ర్యాలీలతో రేవంత్ సత్తా చాటారు. అయితే అంతా మంచిగా జరిగితే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవుతుంది.

అందుకే కాంగ్రెస్‌లో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు రచ్చ మొదలైంది. ఇక రేవంత్‌పై సీనియర్లు డైరక్ట్ గానే ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. అటు రేవంత్ సైతం..సీనియర్లని పెద్దగా పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకెళ్లడం స్టార్ట్ చేశారు..దీంతో కాంగ్రెస్ లో విభేదాలు ఇంకా పెరిగాయి. ఇక పార్టీని వరుసపెట్టి కొందరు నాయకులు విడిచి వెళ్లిపోయారు. అలాగే ఉపఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయాలని మూటగట్టుకుంది.

ఆఖరికి తమ కంచుకోట అనుకున్న మునుగోడులో కూడా 24 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయింది. ఇక తాజాగా మర్రి శశిధర్ రెడ్డి లాంటి సీనియర్ పార్టీని వీడారు. రానున్న రోజుల్లో మరికొంతమంది పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని తేలింది. దీంతో కాంగ్రెస్  ఏ మాత్రం పికప్ అయ్యేలా కంపించడం లేదు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి తన గేమ్ ప్లాన్ మార్చారు. కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చేయడానిక రెడీ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి ఉన్న రేవంత్..ఏ‌ఐ‌సి‌సి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు.

అలాగే పార్టీలో భారీ స్థాయిలో జిల్లా అధ్యక్షులని మార్చడానికి చూస్తున్నారు..ఇటు కొందరు వర్కింగ్ ప్రెసిడెంట్లని కూడా మార్చే యోచన చూస్తున్నారు. ఎక్కువ శాతం తనకు అనుకూలమైన టీంని ఏర్పాటు చేసుకోవాలని రేవంత్ చూస్తున్నారు. అటు తెలంగాణ రాజకీయ వ్యవహారాలని ప్రియాంక గాంధీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె తెలంగాణపై ఫోకస్ పెట్టారు..ఏమున్నా తనతో మాట్లాడాలని టీ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఇదే క్రమంలో ఇప్పుడు కూడా ప్రియాంక లీడ్ తీసుకుని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాలని చూస్తున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడు లైన్ లో పడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news