Breaking : రేపు నల్గొండకు కేసీఆర్‌.. ఏర్పాట్లు సర్వం సిద్ధం

-

రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను
పరిశీలించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు జెన్​కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ కూడా వచ్చే అవకాశం ఉండడంతో.. ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. హెలీప్యాడ్ పనులను, ముఖ్యమంత్రి పరిశీలించనున్న ప్లాంటు పరిసరాలను మిర్యాలగూడ ఆర్డిఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావులు జెన్​కో అధికారులతో కలిసి పరిశీలించారు. దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇది మొదటిది. ఒకే స్థలంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించనున్న నేపథ్యంలో అధికారుల హడావుడి నెలకొంది. ఈ కేంద్రం నిర్మాణ పనుల టెండరును భెల్‌ సంస్థ దక్కించుకుంది. మొత్తం రూ.29,992 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు ఉన్నాయి.

KCR 2.0 makes rapid strides in welfare

దీని నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. వీటిలో మొదటి ప్లాంటులో విద్యుదుత్పత్తిని 2023 సెప్టెంబరుకల్లా ప్రారంభిస్తామని జెన్‌కో తాజాగా వెల్లడించింది. అదే ఏడాది డిసెంబరుకల్లా రెండోప్లాంటు, 2024లో 3, 4 ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. విద్యుత్ కేంద్రం నిర్మా ణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం మొత్తం నిర్మాణంలో ఇప్పటికే 61.5 శాతం పనులు పూర్తయ్యాయి. ఒకటీ, రెండు ప్లాంట్ల లో ఇంకాఎక్కువ శాతం జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఇది. దీని నిర్మాణాన్ని సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర అవసరాలకు కరెంటు కొరత ఉండదని ప్రభుత్వ అంచనా. 2023 డిసెంబరు నాటికల్లా
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం జెన్‌కోకు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news