నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ సినిమా త్వరలోనే..!!

నందమూరి బాలకృష్ణ వయస్సు పెరుగుతున్నా కూడా ఇంకా యువకుడి గానే చలాకీగా నటిస్తున్నారు. ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి లో నటిస్తున్నారు.ఇక ఇందులో  యాక్షన్ సన్నివేశాలు ఫైట్స్ కోసం చాలా కష్టపడు తున్నారు. ఇందులో దాదాపు పది ఫైట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వయస్సు లో అన్ని ఫైట్స్ పెట్టే గట్స్ మరెవరికీ లేవంటే అతిశయోక్తి కాదు.

ఇక  తర్వాత సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. దీనిలో కూడా బాలయ్య కు తగ్గట్టుగా గా ఉండేలా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండనున్నాయట. ఇక తాజాగా గోవా ఫిలిం ఫెస్టివల్ లో బాలయ్య బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ  ను ప్రదర్శించారు. ఆ సందర్భంగా బాలయ్య  హాజరయ్యాడు.

ఈ సందర్బంగా చాలా ఏళ్లుగా మిస్ట్టేరీ గా ఉన్న తన కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు బాలయ్య బాబు.వచ్చే సంవత్సరం కచ్చితంగా తన కొడుకు మోక్షజ్ఞ సినిమా మొదలు కాబోతుంది అని అధికారికంగా ప్రకటించాడు. తన కుమారుడు వచ్చే సంవత్సరం టాలీవుడ్ లో ఖచ్చితంగా అడుగుపెడతాడని చెప్పారు. డైరక్టర్ ఎవరని అడగగా ప్రస్తుతానికి ఆ విషయం సస్పెన్స్ అన్నట్లుగా బాలకృష్ణ సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే సబ్జెక్టు ఒకే అయ్యింది.సమయం చూసి మోక్షజ్ఞ యొక్క సినిమా ను ప్రకటిస్తాం అని చెప్పారు బాలయ్య బాబు. దీనితో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.