టికెట్ టు ఫినాలే కోసం రంగు పడేలా కొట్టుకున్న కీర్తి, ఇనయా..!!

-

తెలుగు బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ పూర్తి చేసుకొని 6 సీజన్ కూడా రన్ అవుతోంది.. ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయి పోయారు.ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ స్నోమాన్ టాస్క్ నిర్వహించాడు.

స్నోమాన్ బొమ్మ భాగాలు సేకరించి రూపొందించాలి. అదే సమయంలో తమ బొమ్మను ఇతర కంటెస్టెంట్స్ నుండి కాపాడుకోవాలి. స్నోమాన్ టాస్క్ లో మొదట శ్రీసత్య తర్వాత కీర్తి, ఇనయా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరు టికెట్ టు ఫినాలే టాస్క్ లో పోటీపడేందుకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు. కీర్తి, ఇనయా, శ్రీసత్యల మధ్య ఒక గేమ్ పెట్టిన బిగ్ బాస్ గెలిచిన కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే టాస్క్ లో పోటీపడవచ్చు అన్నారు.

దీనిలో భాగంగా ముగ్గురు నిలిచి రెడ్ కలర్ ను వారి వైట్ కలర్ టీ షర్ట్ మీద పూయాలి. దీనిలో ముందే శ్రీ సత్య చేతులు ఎత్తివేయడంతో ఇనయా, కీర్తి హోరా హోరీగా పోటీపడ్డారు. గెలుపు కోసం  కిందా మీదా పడుతూ కొట్టుకున్నంత పని చేశారు. ఇక ఎండ్ బజెర్ మోగిన తర్వాత మాత్రమే శాంతించారు.సంచాలక్ గా ఉన్న రేవంత్ విన్నర్ ని నిర్ణయించడం చాలా కష్టం అని అన్నాడు ఎవరు టికెట్ టు ఫినాలే టాస్క్ లో పాల్గొనే ఛాన్స్ అందుకున్నారనేది సస్పెన్స్. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అలా సస్పెన్స్ తో ముగిసింది.

Read more RELATED
Recommended to you

Latest news