Breaking : గుజరాత్‌లో ముగిసిన తొలి దశ పోలింగ్‌

-

గుజరాత్‌లో 89 స్థానాలకు తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నేడు ఉదయం మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. అయితే.. సాయంత్రం మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. ఆ లోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడిన వారికి ఓట్లు వేసే అవకాశం ఉంది. గుజరాత్ లోని 182 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశలో ఇవాళ 89 సీట్లకు పోలింగ్ జరిగింది. ఇందులో 788 మంది అభ్యర్థులు పోటీ చేశారు. చెదురుమదురు ఘటనల మినహా నేటి పోలింగ్ అంతా ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో కొన్ని చోట్ల సాంకేతికలోపాలు తలెత్తినట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

Gujarat election 2022 updates: 57% voter turnout recorded as polling in  first phase ends | Hindustan Times

19 జిల్లాల్లో నేడు జరిగిన ఎన్నికల కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిపి 26,269 బ్యాలెట్ యూనిట్లు, 25,430 వీవీప్యాట్లను వినియోగించామని చెప్పారు. ఓ వైపు గుజరాత్ లో తొలి దశ ఎన్నికలు జరుగుతుండగా, మరోవైపు రెండో దశ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. రెండో దశ ఎన్నికలు డిసెంబరు 5న జరుగుతాయి. గుజరాత్ ఎన్నికల ఫలితాలు, హిమాచల్ ఎన్నికల ఫలితాలతో కలిపి ఈ నెల 8న వెలువడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news