చంద్రబాబు హయాంలో చేసిన పాపాలే రైతులకు శాపాలుగా మారాయి – కాకాని

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తాను వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యాఖ్యలు చేస్తే.. వాటిని వక్రీకరించారని మండిపడ్డారు మంత్రి కాకాని. వరి సాగు చేస్తే ప్రభుత్వానికి కలిగే ఇబ్బంది ఏది లేదని స్పష్టం చేశారు. రైతులకు తలకు మించిన భారం కాకూడదని అలా చెప్పానని అన్నారు.

లాభసాటి పంటలు సాగు చేయాలని చెబితే ఇలా వక్రీకరిస్తున్నారని.. వీటిని రైతులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలు బాగా కురిసి పంటల దిగుబడి గననీయంగా పెరిగిందన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంపై కూడా స్పందించారు. చంద్రబాబు హయాంలో చేసిన పాపాలే రైతులకు శాపంగా మారాయని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news