గత కొన్ని రోజులు గా కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య గొడవలు జరుగుతున్నాయి. మొదట్లో వీరి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నా.. ఈ మధ్య పూర్తిగా చెడిపోయాయి. ఈ నేపథ్యంలోనే.. కేంద్రంలోని బీజేపీని ఢీ కొట్టేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే, టిఆర్ఎస్ పార్టీని పేరును బిఆర్ఎస్ పార్టీగా మారుస్తూ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే బిఆర్ఎస్ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలంటూ ఈసీ పత్రికా ప్రకటన జారీ చేసింది. అది ఈరోజుతో ముగియనుంది. ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలుస్తుండగా రేపటి నుంచి బిఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ ప్రక్రియ మొదలు పెట్టనుంది.