ప్యాన్స్ ఫైర్:బాలయ్య బాబు ఇమేజ్ డామేజ్ చేసే పనులు.!

-

నందమూరి బాలకృష్ణ వయస్సు పెరుగుతున్నా కూడా ఇంకా యువకుడి గానే చలాకీగా నటిస్తున్నారు. ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి లో నటిస్తున్నారు.ఇక  తర్వాత సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. దీనిలో కూడా బాలయ్య కు తగ్గట్టుగా గా ఉండేలా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ఉండనున్నాయట. దీనికి బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఐ డోంట్ కేర్ బ్రో అనే టైటిల్ పెడుతున్నారని తెలుస్తొంది.

ఈ రెండూ సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయి అని ఫ్యాన్స్ హ్యాపీ గా ఉన్నారు. ఇక దీని తర్వాత మూవీ ఏంటనే విషయం పై క్లారిటీ లేదు. ఈ లోపు బాలయ్య బాబు అభిమానులు గుండెలు అదిరి పోయే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. అనిల్ రావిపూడి మూవీ తర్వాత బాలకృష్ణ స్వామి రామానుజాచార్య జీవిత కథతో సినిమా తీస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాతగా సి కళ్యాణ్ ఉంటున్నారని అంటున్నారు.

ఒక పక్క వీర సింహా రెడ్డి, ఐ డోంట్ కేర్ బ్రో అనే సినిమాలతో బాలయ్య బాబు దూసుకు పోతుంటే రామానుజాచార్య సినిమా ఏంటిరా బాబు అని తల పట్టుకుని బాధ పడుతున్నారు. అసలే అలాంటి సాప్ట్ కారెక్టర్ చేస్తే బాలయ్య ఇమేజ్ మొత్తం డామేజ్ అవుతుందని ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారట. ఈ సినిమా కనుక నెక్స్ట్ ప్రోజెక్ట్  అని తేలితే వెంటనే ఇంటెర్నెట్ లో సినిమా వద్దని #టాగ్ లతో మోత మోగించాని చూస్తున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news