ఇబ్రహీంపట్నం కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏడాది క్రితమే నవీన్ రెడ్డి -వైశాలి పెళ్లి జరిగిందట. అక్టోబర్ లో వైశాలి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నవీన్ రెడ్డి … వైశాలి నా భార్య లవర్ కాదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో బాపట్లలో మా వివాహం జరిగిందని.. తల్లిదండ్రులకు భయపడి వైశాలి వారితో నే ఉంటుందని నవీన్ రెడ్డి తెలిపారు.
వైశాలి తల్లిదండ్రులతో నాకు ప్రాణహాని ఉందని.. తన భార్య ను తన వద్దకు పంపించడం లేదనీ సెప్టెంబర్ 30న లీగల్ నోటీసు పంపానని వెల్లడించారు నవీన్ రెడ్డి.రెండు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని.. నన్ను చంపేందుకు వైశాలి తల్లిదండ్రులు వేరే వారికి సుపారి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు నవీన్ రెడ్డి.
ఈ ఏడాది జులై నుండి తల్లిదండ్రులతో వైశాలి ఉంటుందని… పెళ్లికి సంబంధించిన అన్ని ఆధారాలు వైశాలి తల్లిదండ్రులు ధ్వంసం చేశారన్నారు. వైశాలి సోదరుడు విదేశాల్లో ఉంటు ఒక ఎన్ అర్ ఐ సంబంధం తీసుకొచ్చాడని నవీన్ రెడ్డి తెలిపారు. ఇక సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.