షాకింగ్‌ : 8 నెలల బాలుడిపై అడవి పిల్లి దాడి.. బాలుడు అక్కడికక్కడే మృతి

-

తల్లి పక్కనే నిద్రిస్తున్న ఎనిమిది నెలల బాలుడిపై అడవి పిల్లి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మరణించగా.. ఆమె తల్లి గాయపడింది. ఈ దారుణం ఉత్తర్‌​ప్రదేశ్​.. ప్రతాప్‌గఢ్‌​లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహులికు చెందిన అజయ్​ గౌర్​కు ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నాడు. అజయ్.. రాజస్థాన్​కు కూలీ పనుల నిమిత్తం వలస వెళ్లాడు. అతడి భార్య ఉమ.. గురువారం అర్ధరాత్రి తన 8 నెలల కుమారుడు రాజ్​తో కలిసి నిద్రిస్తోంది. హఠాత్తుగా ఓ అడవి పిల్లి కిటికీలోంచి వారి గదిలోకి ప్రవేశించింది. విచక్షణారహితంగా రాజ్​ శరీరంపై గోళ్లుతో దాడి చేసింది. ఉమను కూడా గాయపరిచి.. అక్కడి నుంచి అడవి పిల్లి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గదికి చేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో రాజ్ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మరణించాడు.

60+ Free Norwegian Forest Cat & Cat Images - Pixabay

ప్రొఫెసర్​ ఆత్మహత్య..
అసోం.. గువహటిలో దారుణం జరిగింది. ఐఐటీ గువహటికి చెందిన మ్యాథ​మెటిక్స్ ప్రొఫెసర్.. క్యాంపస్​లోని క్వార్టర్స్​లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని సమీర్ కలాంగా గుర్తించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news