వాస్తు: కొత్త క్యాలెండర్ ని ఇంట్లో ఎక్కడ ఉంచాలి..? ఈ దిక్కున పెడితేనే మంచిదట…!

-

వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వాస్తు ని అనుసరించడం మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది. అయితే కొత్త క్యాలెండర్ ని ఏ దిక్కులో ఉంచితే మంచిదనేది వాస్తు పండితులు అంటున్నారు.

 

మరి అలా మీరు పండితులు చెప్పినట్టు అనుసరిస్తే ఏ బాధ ఉండదు. ఇక మరి ఇంట్లో ఎక్కడ కొత్త క్యాలెండర్ ని పెట్టుకోవాలి అనేది చూసేద్దాం. వాస్తు ప్రకారం కొత్త క్యాలెండర్ ని ఇంట్లో పెట్టేటప్పుడు ఉత్తరం, తూర్పు, పడమర వైపు ఉంచడం వలన చాలా మంచి కలుగుతుంది. కొత్త క్యాలెండర్ ని ఇంట్లో పెట్టాలంటే ఉత్తరం, తూర్పు, పడమర వైపునే ఉంచండి. ఇది పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తుంది. నెగటివ్ ఎనర్జీ ని ఇది దూరం చేస్తుంది.

ఎప్పుడూ కూడా క్యాలెండర్ ని దక్షిణం వైపు ఉంచకూడదు. దక్షిణం వైపు ఉంచడం వలన సమస్యలు వస్తాయి. క్యాలెండర్ లో ఉదయిస్తున్న సూర్యుడు, ధనం వంటి ఫోటోలు ఉండొచ్చు. కానీ క్రూర జంతువులు, బాధాకరమైనవి ఉండకూడదు. క్యాలెండర్ లో ఎప్పుడు కూడా ఆకుపచ్చ, నీలం, తెలుపు, పింక్ లేదా ఎరుపు రంగులో ఉంటే మంచిది. ఈ రంగులు పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. ఉత్తరం వైపు క్యాలెండర్ ని ఉంచడం వలన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. గ్రీనరీ, ఫౌంటెన్, పెళ్లి ఫోటోలు వంటివి ఉంచుకోవచ్చు ఇలా ఈ విధంగా పండితులు అనుసరిస్తే కచ్చితంగా ఏ బాధ ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news