ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఈ నేపథ్యంలో సీఎస్ నరేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ప్రాపర్టీ, మ్యారేజ్ రిజిష్ట్రేషన్ లాంటి అన్ని అంశాలను ఇక నుంచి మహిళా ఆఫీసర్లే రిజిస్టర్ చేయనున్నారు. ఢిల్లీ సర్కార్‌లోని రెవన్యూశాఖలో ఉన్న 22 సబ్ రిజిస్ట్రార్స్ పోస్టుల్లో ఇప్పుడు మహిళా ఆఫీసర్లను రిక్రూట్ చేయనున్నారు. మహిళా ఆఫీసర్లు ఉన్నత హోదాల్లో ఉండడం వల్ల.. అవినీతి, వేధింపులు, రెడ్‌టేపీజం ఉండదని ఎల్జీ ఆఫీసు తన ప్రకటనలో పేర్కొన్నది.
సాధారణ ప్రజలకు మహిళా ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని ఎల్జీ తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. సబ్ రిజిస్ట్రార్లుగా మహిళలు ఉంటే అవినీతి తగ్గుతుందని, అధికారిక కార్యకలాపాల్లో తీవ్ర జాప్యానికి అడ్డుకట్ట పడుతుందని, ప్రజలపై వేధింపులు ఉండవని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. సాధారణ పౌరులతో ప్రభుత్వ సంబంధాల పరంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ముందు వరుసలో ఉంటాయని వివరించింది.