టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు.. 2,521ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన వెస్ట్రన్‌ సెంట్రల్‌ రైల్వే లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రైల్వేస్ లో 2,521 అప్రెంటిస్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి.

రైల్వే రిక్యూట్‌మెంట్‌ సెల్‌ ఈ దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నవంబర్‌ 17వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ కమ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్ ఖాళీలు వున్నాయి. అలానే ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, బ్లాక్‌ స్మీత్‌ వంటి పోస్టులు కూడా ఖాళీగా వున్నాయి.

ఇక అర్హత వివరాలలోకి వెళితే.. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ప్యాస్ అయ్యి ఉండాలి. అలానే ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులు వచ్చి ఉండాలి. నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ని కలిగి ఉండాలి. ఈ పోస్టులకి డిసెంబర్‌ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు గురించి చూస్తే.. జనరల్ అభ్యర్ధులు రూ.100 అప్లికేషన్‌ ఫీజు గా కట్టాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వుంది.

అకడమిక్‌ మెరిట్‌, షార్ట్‌లిస్టింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టుల వివరాలను చూస్తే.. జబల్పూర్ డివిజన్‌లో ఖాళీలు- 884, భోపాల్ డివిజన్‌లో ఖాళీలు- 614, కోటా వర్క్‌షాప్ డివిజన్‌లో ఖాళీలు- 160, కోట డివిజన్‌లో ఖాళీలు- 685, CRWS BPL డివిజన్‌లో ఖాళీలు- 158, హెచ్‌క్యూ/జబల్పూర్ డివిజన్‌లో ఖాళీలు- 20 వున్నాయి. పూర్తి వివరాలను https://iroams.com/RRCJabalpur/applicationAfterIndex లో చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news