చిరంజీవికి కార్లు, కారు నెంబర్ల మీద సెంటిమెంట్ ఎక్కువ. ఒకప్పుడు తగ్గిపోయిందని చెప్పినా.. ఆయన ఇంట్లో లేని కారంటూ లేదు. కానీ తను కొన్న మొదటి ఫారిన్ కారు హోండా అకార్డ్ చాలా ఇష్టమంటున్నాడు. ఇది కాకుండా తన దగ్గరున్న పెద్ద కార్ల లిస్ట్ ఇది..
రోల్స్ రాయిస్ ఫాంటమ్
బాలీవుడ్‌లో అమితాబ్ ఎలాగో మనకు మెగాస్టార్ అలాగే. వీరిద్దరిలో కామన్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నట్లే.. వారి కారు కొనే ఆలోచన కూడా ఒక్కటే. నిజమండీ.. ఆటోమొబైల్ రంగంలో అతి లగ్జరీ కారుగా పేరుగాంచిన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ని కలిగి ఉన్న సెలెబ్రిటీలు వీరు. సుమారు.. 3.34కోట్ల విలువ చేసే ఈ కారు చిరంజీవి సొంతం. ఈ కారు ఫీచర్స్ విషయానికొస్తే.. 6.8లీటర్ల కెపాసిటీ, వీ12 ఇంజిన్‌ని కలిగి ఉంది. పైగా ఈ కారు నంబర్ 1111.
టయోటా ల్యాండ్ క్రూసర్
చిరంజీవి 59వ పుట్టినరోజు సందర్భంగా చరణ్ ఈ కారును బహుకరించాడు. ఈ కారును కలిగి ఉన్న స్టార్‌గా కూడా చిరంజీవి రికార్డు కొట్టేశాడు. దీని పాత వెర్షన్ కారు కూడా చిరంజీవి దగ్గర ఉంది. ఇక దీని ధర 1.19కోట్లు. ఫీచర్స్ విషయానికొస్తే.. 4.5 లీటర్లు, వీ8 టర్బో డిజిల్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఎస్‌యూవీ కార్లలో మొదటి వెర్షన్‌ని చిరంజీవి డైరెక్ట్ కంపెనీ నుంచే దిగుమతి చేసుకున్నాడు.
రేంజ్ రోవర్ వోగ్
పాత జనరేషన్ రేంజ్ రోవర్ రోగ్‌ని చిరంజీవి ఎస్‌యూవీ కార్లలో ఒకటి. అవుట్‌స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్‌తో పనిచేసే ఈ ఎస్‌యూవీ లోపల ఇంటిరీయర్స్ చూస్తే షాకయిపోతారు. కొత్త వెర్షన్ ఈ కారు కాస్త పెద్దదిగా ఉంటుంది. పైగా టర్బో డిజిల్స్ ఆప్షన్ ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్. ఈ కారు ధర సుమారు కోటి రూపాయల పై మాటే.
ఇవి కాకుండా చిరంజీవి దగ్గర చిన్న కార్లు చాలానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ‘ఏ కారు అయినా ఒకటే.. ఏదైనా చోటికి వెళ్లడానికి కావాల్సిన కనీసం అవసరం’ అంటూ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి అనడం ఇక్కడ కొసమెరుపు.