బ్రేకింగ్: వినాయకుడి లడ్డూ వేలం పాట రద్దు

-

హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలకు గానూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఈసారి మాత్రం కరోనా మహమ్మారి కారణంగా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. తాజాగా బాలాపూర్ ఉత్సవ కమిటీ లడ్డూ వేలం పాటపై షాక్ ఇచ్చింది. ఈ సారి లడ్డూ వేలం ప్రక్రియను రద్దు చేశామని పేర్కొన్నారు. 26 ఏళ్లలో లడ్డూ వేలం ప్రక్రియ లేకపోవడం ఇదే మొదటిసారని కమిటీ వెల్లడించింది.

History Of Balapur Ganesh Laddu

విగ్రహ ఎత్తును 6 అడుగులకు తగ్గించామని చెప్పింది. సాధారణ భక్తులకు లోపలికి ప్రవేశం లేదని స్పష్టం చేసింది. ఉదయం.. సాయంత్రం పూజారి మాత్రమే పూజలో పాల్గొంటారని పేర్కొన్నారు. నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని, రేపు సాయంత్రం 6 గంటలకు పూజ మొదలవుతుందని పేర్కొన్నారు. దాదాపు అన్ని ఉత్సవ కమిటీలు ఇదే విధంగా నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news