Breaking : ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌.. హస్తినా నుంచి హైదరాబాద్‌కు రాక

-

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.ఈ క్రమంలో ఆయన హస్తిన నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఐదు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిని నియమించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై, కార్యాచరణపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ… తెలంగాణ గడ్డ మరో ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర రాజకీయాలలో బలమైన పార్టీగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన బీఆర్ఎస్ రాబోయే రోజులలో చరిత్రను తిరగరాస్తుంద‌న్నారు.

Telangana: CM KCR to review on Dalit Bandhu scheme in Karimnagar today

తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి పరిచయం అవుతాయ‌న్నారు. దేశంలో రాబోయే రోజులలో గుణాత్మక మార్పుకు బీఆర్ఎస్ పార్టీ నాంది పలుకుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దేశంలో మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారన్నారు. ఆనాడు ఎలాగైతే ప్రత్యేక రాష్ట్ర సాధనకు విప్లమాత్మక పంథాను అనుసరించారు.. అలాగే దేశ హితం కోసం నూతన రాజకీయ వరవడిని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బీజేపీ, కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయని, దేశ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఇప్పటికే చర్చలు జరిపారని, అనేక మంది హేమా హేమీ నేతలు సీఎం కేసీఆర్ ఆలోచనతో ఏకీభవించారని కలిసి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. దేశంలో రాబోయే రోజుల్లో గురుణాత్మక మార్పుకు బీఆర్ఎస్ పార్టీ నాంది పలుకుతుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news