BREAKING : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి రూ.900 కోట్ల భారీ జరిమానా

-

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటి 900 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగిస్తు కోర్టు ధిక్కరణ కు పాల్పడుతున్నారని పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.


ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు తెలంగాణపై 300 కోట్ల జరిమానా విధించింది. అలాగే, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 528 కోట్ల జరిమానా విధించింది.

దిండి ప్రాజెక్టులో పర్యావరణ నష్టపరిహారానికి 92.8 కోట్ల నష్టం జరిమానా వేసింది. ఈ జరిమానాలన్నీ మూడు నెలల్లో చెల్లించాలని ఆదేశించింది ఎన్జీటి. జరిమానా మొత్తాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వద్ద జమ చేయాలని.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news