మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పాత కలెక్టరేట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ను దత్తత తీసుకున్నాయన ఎక్కడ పోయిండు..? అని ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే మహబూబ్ నగర్ కి మెడికల్ కాలేజ్ లు వచ్చేవా? అన్నారు. మూడు వందల కోట్ల రూపాయలతో వెయ్యి పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు.
క్యాన్సర్ తో పాటు అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడే అందుతాయన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి మెడికల్ మహబూబ్ నగర్ కి కేటాయించారని గుర్తు చేశారు. 50 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు అంటే అందరికి మొసలి కన్నీరేనని.. దత్తత తీసుకున్న చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకుని రాలేదన్నారు. జాతీయ స్థాయి నాయకులు ఉన్న మెడికల్ కాలేజ్ కూడా తీసుకుని రాలేదన్నారు.