భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి బిజెపి నేతలు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కరోనా పేరుతో యాత్రకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన యాత్ర కాశ్మీర్ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మాస్కులు ధరించాలని, కరోనా వ్యాప్తి చెందుతుందని ఇవన్నీ వారు చెబుతున్న సాకులు లేనని అన్నారు.
యాత్రను ఆపివేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి మాండవియా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ వల్ల విద్వేషం నిండుతోందని.. ఇటువంటి భారత్ ని తాము కోరుకోవడం లేదన్నారు. తమ పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి భయపడి యాత్రను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అంటున్నారు.