ఈ బుడ్డోడు టాలీవుడ్ లవర్ బాయ్..

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. అలాగే ఇప్పటికే ఎందరో హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరో చిన్న నాటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది..

ఈ ఫోటోలో స్టైల్ గా ఫోటోకు ఫోజిస్తున్న ఈ బుడ్డోడు టాలీవుడ్ హీరో.. ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన లవర్ బాయ్ తరుణ్.. బాల నటుడిగా తన కెరీర్ను ప్రారంభించిన తరుణ్.. దళపతి, ఆదిత్య 369, గౌరమ్మ, తేజ, అంజలి వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే రఘు వరన్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన అంజలి సినిమాలో తరుణ్ నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా వచ్చింది..

సీనియర్ హీరోయిన్ రోజా రమణి తనయుడు అయిన తరుణ్ బాలునటుడుగా మంచి పేరు సంపాదించుకున్నాక.. హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. శ్రేయ హీరోయిన్గా నటించిన నువ్వే కావాలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, అదృష్టం, నువ్వే నువ్వే.. వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.. అయితే కొన్నాళ్లపాటు టాలీవుడ్లో తిరుగులేని హీరోగా హిట్లు సంపాదించుకున్న తరుణ్ తర్వాత మాత్రం వరుస డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు అలాగే ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు..

Read more RELATED
Recommended to you

Latest news