ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాపారాలను చేయడానికి చూస్తున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా చూడండి. పుట్టగొడుగుల పెంపకం తో మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
తొలిదశలో రెండు లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. ఏదో చెప్పాలని ఇలా చెప్పడం లేదు నిజంగా జరిగింది. ఓ మహిళా ఈ వ్యాపారం ద్వారా మంచిగా సక్సెస్ అయ్యారు. ఇక వివరాల లోకి వెళితే.. గ్రూపు నుంచి రూ.60 వేలు అప్పు తీసుకుని ఓ మహిళా పుట్టగొడుగుల పెంపకం స్టార్ట్ చేసారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ మహిళలు ఇంటి లోపల పుట్టగొడుగులను పెంచారు. ఇది నిజంగా గొప్ప విషయం. తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని వీళ్ళు పొందుతున్నారు.
ఈ మహిళలు పుట్టగొడుగుల పెంపకం మాత్రమే కాక తేనెటీగల పెంపకం, కాశ్మీరీ మిరపకాయలను ఉత్పత్తి చేయడం వంటివి కూడా చేస్తున్నారు. మంచిగా డబ్బులని సంపాదించుకుంటున్నారు. బసంత్‌పూర్ గ్రామ గోథన్లో పని చేస్తున్న సోన్మతి కుష్వాహ తన సక్సెస్ గురించి ఇలా చెప్పారు. పిల్లల చదువుల ఖర్చులు భరించలేక ఎన్నో బాధలు పడ్డాము. గతంలో సాధారణ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకం తో మంచిగా డబ్బులు వస్తున్నాయని చెప్పారు. పైగా ఇక్కడకి బైకుల మీద కార్లు మీద వచ్చి చాలా మంది వీటిని కొంటూ ఉంటారట. గ్రూపు నుంచి రూ.60 వేలు అప్పు తీసుకుని దీన్ని మొదలు పెట్టగా తొలిదశలోనే రూ.2 లక్షల ఆదాయం వచ్చింది.