ఆ డైరెక్టర్ చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను..!!

-

మిల్కీ బ్యూటీ తమన్నా  సినిమాకు పరిచయం అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా తన గ్లామర్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈమె స్ట్రక్చర్ చూసి సాటి హీరోయిన్స్ అసూయ చెందే వారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఇంకా అందమైన యంగ్ హీరోయిన్ గా కనపడుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంది.

ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తాను సినిమా పరిశ్రమ కు ఎలా పరిచయం అయ్యిందో చెప్పింది. తాను ముంబయిలో ఇంటర్ మీడియట్ చదువుకుంటున్న సమయంలోనే సినీ రంగ ప్రవేశం చేశానని చెప్పారు. అప్పుడు తన వయసు కేవలం 15 ఏళ్లని.. మొదటిగా సాంద్ సా రోషన్ షహానా అనే హిందీ చిత్రంలో నటించినట్లు తెలిపారు. అయితే తొలి ప్లాప్ అయ్యిందని.. ఇక అదే ఏడాదిలో మంచు మనోజ్ నటించిన శ్రీ చిత్రం ఆఫర్ వచ్చిందని. ఆ సినిమా కూడా హిట్ కాలేదని దానివల్ల నాకు చాలా నిరాశ గా అనిపించింది అని చెప్పుకొచ్చింది.

అయినా కూడా నిరాశ చెందకుండా అన్ని ప్రోజెక్ట్ హౌస్ లకు ఫోటోస్ పంపిస్తూ నే ఉన్నానని చెప్పింది. ఆ టైమ్ లోనే  డైరెక్టర్ శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ కోసం పిలిపించారు. ఆడిషన్ చేసి ఆ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చారు. ఈ ఊహించని విజయాన్ని అందుకుందని. అక్కడి నుండి మళ్లీ వెనక్కి తిరిగి చూసే అవకాశం ఇవ్వలేదని చెప్పింది. తెలుగు తర్వాత వరసగా తమిళ్, హిందీ సినిమా అవకాశాల వచ్చాయి. నా జీవితంలో హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news