బిఆర్ఎస్ పార్టీకి పేదలే ఆత్మ బంధువులని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. పేదలకు సహాయం చేయడమే పరమావధిగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిద్దిపేటలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి హరీష్ రావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవు ప్రకటించింది అన్నారు. సిద్దిపేట సి ఎస్ ఐ చర్చి నిర్మితమై 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు హరీష్ రావు. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వమని.. అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉన్న దేశమే భారతదేశం అని అన్నారు.