వందమంది అవసరం లేదు ఇలాంటి ఒక్కరు మన పక్కనుంటే చాలు..!

-

మనకంటూ కొంతమంది మనుషులు ఉండాలని ప్రతి ఒక్కరు తప్పన పడుతూ ఉంటారు. మనకి ఆనందం వచ్చినా కష్టం వచ్చినా కూడా మన చుట్టూ ఓ నలుగురు ఉండాలని కోరుకుంటూ ఉంటాము. అయితే చాలామంది మన జీవితంలో ఎంత మంది స్నేహితులు ఉన్నారని చూస్తూ ఉంటారు. కానీ నిజానికి మన లైఫ్ లో ఎంత మంది స్నేహితులు ఉన్నారు అనేది అసలు ముఖ్యం కాదు.

 

మనకంటూ తోడుగా ఒక్కరు ఉన్నా చాలు. కష్టాల్లో.. ఆనందాల్లో.. నష్టాల్లో ఒకరు ఉంటే చాలు. అటువంటి వాళ్ళు నిజమైన స్నేహితులు. మన స్నేహితులు అని మనం అనుకునే వాళ్ళు అన్ని సమయాల్లో కూడా మనతో ఉండాలి. వాళ్లు కూడా మనతో ఉండాలి అని అనుకోవాలి. కొంతమంది బాధల్లో ఉంటే దగ్గరికి కూడా రారు ఆనందంలో ఉంటే మాత్రం కచ్చితంగా వచ్చేస్తూ ఉంటారు. అయితే మంచి స్నేహితులు ఎవరంటే కష్టాల్లోనూ.. ఆనందాల్లోనూ రెండిట్లో కూడా ఉండాలి.

చిన్నప్పుడు మన స్నేహితులు ఎంతమంది ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాం కానీ పెద్దయిన తర్వాత అందరి స్వభావం తీరు మారుతూ ఉంటుంది. మనస్తత్వాలు కూడా మారుతూ ఉంటాయి ట్రూ కలర్స్ బయటపడతాయి. స్కూల్లో మనం బ్యాచ్లని మెయింటైన్ చేస్తూ ఉంటాము కానీ పెద్దయిన తర్వాత కాలేజీల్లో ఉద్యోగం సమయంలో మనతో తోడుగా ఒక్కరు మాత్రమే ఉంటారు. అయితే నిజానికి ఎప్పుడూ కూడా ఎంతమంది స్నేహితులు ఉన్నారు అనేది అస్సలు ముఖ్యం కాదు మన కోసం తోడుగా ఒక్కరు ఉన్నారా లేదా అనేది అవసరం.

నిజానికి ఫేక్ గా వుండే వంద మంది ఉన్నా సరే ఆ ఒక్కరు పక్కన ఆ వందమంది సాటి రారు. సో ఎప్పుడూ కూడా మీరు మీ కోసం ఎంత మంది స్నేహితులు ఉన్నారు అనేది చూసుకోకండి మీ కోసం ఏం చేయడానికైనా ఒక్కరు ఉన్నారా లేదా అనేది మాత్రమే చూసుకోండి. ఆ ఒక్కరు ఉంటే చాలు జీవితం ఎంతో సాఫీగా వెళ్ళిపోతుంది. అన్ని సందర్భాల్లో కూడా ఎంతో బాగుంటుంది. ఏ చిన్నపాటి కష్టం వచ్చినా ఇట్టే దాటేయొచ్చు. మరి ఆ ఒక్కరూ మీకూ ఉంటే వాళ్ళతో ఈ విషయాలని పంచుకోండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news