రేవంత్ ‘యాత్ర’…కాంగ్రెస్‌కు లాస్ట్ ఛాన్స్..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ తగ్గుతుందని చెప్పవచ్చు. వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పాటు బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్. అసలు రాష్ట్రంలో బీజేపీకి పెద్ద బలం లేదు. ఏదో 10-15 స్థానాల్లోనే బీజేపీకి బలమైన నాయకత్వం ఉంది. అలాంటిది ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. వరుసగా ఉపఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. మునుగోడులో కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీని ఓడించినంత  పనిచేసింది. అలాగే బీజేపీలోకి వలసలు విపరీతంగా పెరిగాయి.

ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు ఫైట్ జరుగుతుంది. ఈ రేసులో కాంగ్రెస్ వెనుకబడింది. పైగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో నడుస్తున్నాయి. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు.సొంత పార్టీలోనే గొడవలు పడుతున్నారు. దీని వల్ల పార్టీ దారుణంగా తయారైంది. తాజాగా దిగ్విజయ్ సింగ్ వచ్చి..పార్టీని లైన్ చేయడానికి చూశారు. అయితే అక్కడితో పార్టీ గాడిలో పడిందో లేదో అర్ధం కాకుండా ఉంది. ఇంకా పార్టీలో నివురుగప్పిన నిప్పు మాదిరిగా నేతల మధ్య విభేదాలు ఉన్నాయి.

అయితే పార్టీని గాడిలో పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారు. త్వరలోనే పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. జనవరి 26 నుంచి పాదయాత్ర చేయనున్నారు. జూన్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీకి చివరి అవకాశం అని చెప్పవచ్చు. దీంతో అయిన పార్టీ గాడిలో పడితే పర్లేదు. లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం.

కానీ సీనియర్లు పాదయాత్రని సజావుగా సాగనిస్తారా? ఎలాంటి రచ్చ జరగకుండా ఉంటుందా? అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో జరిగింది..అయినా సరే దాని ప్రభావం పెద్దగా లేదు. మరి రేవంత్ రెడ్డి పాదయాత్రతో అయినా పార్టీ బాగుపడుతుందేమో చూడాలి. అది కూడా జరగకపోతే ఇంకా కాంగ్రెస్ పరిస్తితి అస్సామే.

Read more RELATED
Recommended to you

Latest news