ప్రముఖ కోలీవుడ్ నటి త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20సంవత్సరాలు అవుతున్నా ఇంకా తన హవా కొనసాగిస్తోంది అంటే ఆమెకు అభిమానులు ఏ రేంజ్ లో నీరాజనం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన త్రిష ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఆ రాష్ట్రం నుండే అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన త్రిష తన రాజకీయ ఎంట్రీపై కూడా అసలు విషయాన్ని వెల్లడించింది.
త్రిష మాట్లాడుతూ.. రాజకీయాలలోకి వెళ్లాలనే ఆసక్తి లేదు.. రాజకీయాలలోకి పదవుల కోసం వెళ్లకూడదు.. జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేయగలిగితేనే రాజకీయాలలోకి వెళ్ళాలి. అదే నా అభిప్రాయం.. అంత ఓపిక, ధైర్యం నాకు లేదు అంటూ రంగీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొని ..ఈ విషయాలు వెల్లడించింది త్రిష.. ఆమె మాట్లాడుతూ..” 20 ఏళ్లకు పైగా వెండితెరపై ఉన్నాను.. ఎప్పుడూ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాను.. ఎలాంటి నెగటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోను.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే ప్రచారం మొదలైంది.. ఆ సమాచారంలో ఒక్క శాతం కూడా నిజం లేదు.. రాజకీయాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు.. నీ అభిమాన నటుడు ఎవరు వంటి ప్రశ్నలకు నన్ను దూరంగా ఉంచడం మంచిది “అంటూ కూడా బదులిచ్చింది.
ఇకపోతే రంగీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న ఈమె ఇప్పటికే ట్రైలర్ విడుదల అయ్యి వైరల్ గా మారింది. డిసెంబర్ 30 తేదీన సినిమా థియేటర్లలోకి రానుంది. ఇక అంతే కాదు మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులు , మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ఇంకా పటిష్టమైన చట్టాలు రావాలి అని కూడా కోరింది.