ఏది చెయ్యకూడదో అది చెయ్యడం ఈ కాలంలో యూత్ స్టైల్..అందుకే చెప్పిన మాట వినాలి అంటున్నారు..ఇంతకీ ఇది ఎందుకు ఇదంతా చెబుతున్నాము అనుకుంటున్నారా.. పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు.. మనం ఎవరికీ ఏది చేస్తే మనకు తిరిగి అదే ప్రతి ఫలం దక్కుతుంది.. అందులో సందేహం లేదు.. ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాము తినడం, తాగడం, నవ్వడం, డ్యాన్స్ వంటి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి.. లైక్స్ , షేర్స్ తో హోరెత్తిస్తున్నారు.
అయితే కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని తెప్పిస్తే… మరోకొన్ని నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది.మనం చూస్తున్న వీడియోలో ఓ యువకుడు బతికి ఉన్న పురుగులను పట్టుకుని తింటూ కనిపించాడు. అయితే చాప్ స్టిక్స్ తో పురుగుని పట్టుకుని.. దానిని కెమెరాకు చూపించాడు. ఆ తర్వాత ఆలస్యం లేకుండా ఆ పురుగుని నోటిలో పెట్టుకున్నాడు. అప్పుడు ఆ యువకుడి భాధను చూసి ఎవరైనా అయ్యో అనాల్సిందే.
బతికి ఉన్న ఒక పురుగుని పట్టుకున్నాడు. అది ప్రాణం కోసం కొట్టుకుంటూ రెక్కలను చప్పుడు చేస్తోంది. అది కందిరీగలా ఉంది. అంతేకాదు కందిరీగ చాలా ప్రమాదకరమైనది. అయినప్పటికీ ఆ యువకుడు ఓ వైపు భయపడుతూనే మరోవైపు కందిరీగను నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు కందిరీగ అతడి నోటిని కుట్టునట్లు ఉంది. దీంతో ఆ యువకుడి నోరు బాగా ఉబ్బింది.. ఇలా చెయ్యొద్దని ప్రమాదమని చెప్పారు.. అలా ఎప్పటికీ చెయ్యొద్దని చెప్పాడు..ఏది ఏమైనా అతనికి తిక్క కుదిరింది..మొత్తానికి ఆ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది..
So dumb! pic.twitter.com/S1coIikeID
— Instant Karma (@Instantregretss) December 10, 2022