కిసాన్‌ వికాస్‌ పత్ర స్కీమ్‌ లో మార్పులు..?

-

అన్నదాతల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. అయితే వాటిలో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో చాలా బెనిఫిట్స్ ని పొందొచ్చు. కిసాన్‌ వికాస్‌ పత్ర స్కీమ్ లో డిపాజిట్ చేస్తే వార్షికంగా 7% వడ్డీ రేటు ఉంటుంది. ఈ రేటులో సవరణలు జరిగే ఛాన్స్ వుంది. 2023 నూతన సంవత్సరం మొదటి త్రైమాసికం లో కొత్త వడ్డీ రేట్లు రావచ్చు.

అయితే ఈ స్కీమ్ లో మార్పులు జరిగేలానే కనపడుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు వలన మార్పులు చేయచ్చు. పైగా చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై కేవీపీ కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు ని కేంద్రం సవరించనుంది. 2023 మొదటి త్రైమాసికం లో వడ్డీ రేటు ఈరోజు తెలియచ్చు.

అసలు ఈ స్కీమ్ లో ఎంత పెట్టాలి..?

రూ. 1000తో ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టచ్చు. మాక్సిమం లిమిట్ అంటూ ఏమి లేదు. ఇందులో డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాల 4 నెలలలో మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత ఆ డబ్బులు రెండింతలు అవుతాయి. రూ. 5 లక్షలు పెట్టుబడి కనుక పెడితే రూ. 5 లక్షలలో ఈ మొత్తం 10 సంవత్సరాల 4 నెలల తర్వాత మెచ్యూర్‌ అవుతుంది. అప్పుడు రూ.10 లక్షల వరకు పొందవచ్చు. మీరు మీ డబ్బును రెండున్నరేళ్ల తర్వాత కూడా విత్ డ్రా చెయ్యచ్చు. 6.9 శాతం వడ్డీ లభిస్తుంది.
.

Read more RELATED
Recommended to you

Latest news