బాబుకు షాక్..టీడీపీతో నష్టమే..బీజేపీ డిసైడ్.!

-

2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు…మళ్ళీ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్న విషయం తెలిసిందే. 2014లో పొత్తు పెట్టుకుని కొన్నేళ్లు బాగానే కలిసి ఉన్నారు..కానీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని చెప్పి టీడీపీ..బీజేపీ పొత్తు నుంచి బయటకొచ్చి..కేంద్రం టార్గెట్ గా ఎలాంటి విమర్శలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. అయితే 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయాక చంద్రబాబు..ఎలాగోలా మోదీ మద్ధతు పొందాలని చూస్తున్నారు. ఆయనని ఎప్పటికప్పుడు పొగుడుతూ వస్తున్నారు.

తాజాగా కూడా నెల్లూరు రోడ్ షోలో మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒకప్పుడు అదే మోదీని, అటు అమిత్ షాలని టార్గెట్ చేసి విమర్శలు చేసిన బాబు..ఇప్పుడు వారిని పొగిడే పరిస్తితి. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలవడం కోసం బాబు అన్నిరకాలుగా కష్టపడుతున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు ఉంటే కేంద్రం సపోర్ట్ ఉంటుందని, అధికార బలం కలిసొస్తుందని భావిస్తున్నారు.

అందుకే బీజేపీ మద్ధతు కోసం పాకులాడుతున్నారు. ఇదే సమయంలో ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ బీజేపీ బలాన్ని పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారీ సభ పెట్టి సక్సెస్ అయ్యారు. దీని ద్వారా తెలంగాణలో తమకు బలం ఉందని చూపించి..బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి సహకరించి..ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారు.

అయితే టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ దారుణంగా నష్టపోయిందని, టీడీపీని అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ రాజేసి కేసీఆర్ లబ్ది పొందారని..ఇప్పుడు అదే టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి నష్టం ఉంటుందని విజయశాంతి, ధర్మపురి అరవింద్ లాంటి వారు తాజాగా బీజేపీ సమావేశంలో మాట్లాడారు. పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. దీంతో బండి సంజయ్…టీడీపీతో పొత్తు ఉండదని చెప్పారు..అలాగే కార్యకర్తలకు కూడా చేరేలా చెప్పాలని నేతలని బీజేపీ సింగిల్ గానే ఎన్నికలకు వెళుతుందని అన్నారు. మొత్తానికి టీడీపీతో పొత్తు ఉండదని తేల్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news