కరోనా లెక్కలు చెప్పండి.. చైనాకు WHO విజ్ఞప్తి..

-

కరోనా మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడి చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వేరియంట్ల విజృంభించడంతో పెద్ద సంఖ్యలో జనం కరోనా బారినపడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోవడంతో నేలపైనే పడుకోబెట్టి చికిత్స కొనసాగిస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా విషయంలో వాస్తవాలను వెల్లడించాలంటూ చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘేబ్రియేసస్ మరోమారు విజ్ఞప్తి చేశారు. మూడేళ్లుగా ఈ మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతోందని, ఈ వైరస్ విషయంలో అబద్ధాలను ప్రచారం చేయొద్దని కోరారు. ఈమేరకు చైనా ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందంతో ఘేబ్రియేసస్ తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనాలో ప్రస్తుత పరిస్థితిని ప్రపంచానికి వెల్లడించాలని ఆయన కోరారు.

WHO head urges G7 boost UN vaccination program | World News,The Indian  Express

వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలు, జెనెటిక్ సీక్వెన్సింగ్, కరోనాతో ఆసుపత్రులకు చేరిన వాళ్ల సంఖ్య, ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఎంతమంది, కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ లెక్కలు.. తదితర వివరాలను ప్రపంచానికి వెల్లడించాలని ఘేబ్రియేసస్ కోరారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో వైరస్ వేరియంట్ల పరిశీలన, వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న చికిత్స, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news