Big News : టీడీపీతో పొత్తుపై బండి సంజయ్‌ క్లారిటీ

-

తెలంగాణలో ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై చర్చ మొదలైంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తుండగా… రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని విజయశాంతి, ఎంపీ అర్వింద్ తదితరులు అడిగారు.

Karimnagar: Bandi Sanjay arrested for violating Covid norms - Telangana  Today

దీనికి సమాధానంగా టీడీపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే నిజామాబాద్, వరంగల్ లలో టీడీపీ బహిరంగసభలు జరగనున్న తరుణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటు మిషన్ 90 లక్ష్యంగా టీ బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా జరిగిన సమావేశంలో మిషన్ 90పై బ్లాప్రింట్ సిద్దం చేశారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కమలం కార్యాచరణ చేపట్టింది. ‘కేసీఆర్ కో హటావో.. తెలంగాణకో బచావో’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. రాబోయే 10 నెలల కార్యాచరణపై రూట్‌మ్యాప్ కమలదళం సిద్దం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news