నా తమ్ముణ్ణి తిట్టి.. నన్ను పెళ్లికి పిలుస్తున్నారు.. చిరంజీవి..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా జనసేన అని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న సవాళ్ల కోసం వచ్చారు ఈ సందర్భంగా నిజాయితీతో ఉన్న పవన్ రాజకీయాల వల్ల అందరితోనూ మాటలు పడాల్సి వస్తుందని అన్నారు అంతే కాకుండా తన తమ్ముడిని తిట్టిన వాళ్ళని కలవాల్సి రావటం తనని బాధిస్తుందని చెప్పుకొచ్చారు..

మెగాస్టార్ చిరంజీవి తాజాగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న సవాళ్ల కోసం చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు అలాగే మురికిని తొలగించే సమయంలో మనకు కూడా కొంతమంది అంటుకోవడం సహజమని చెప్పుకొచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ ఎప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తాడని తెలిపారు.. ప్రతిక్షణం సమాజానికి ఏదో చేయాలని పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు..

సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్నతమైన స్థాయిని అందుకున్న పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమైనప్పుడు ఎంతో హుందాగా ప్రశాంతంగా బతికేవారు కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతే కాకుండా అందరూ నుంచో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయింది ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. “పవన్ కళ్యాణ్‌ కు కొంత కూడా స్వార్థం లేదు. ప‌ద‌వీ కాంక్ష లేదు. డ‌బ్బు వ్యామోహం అసలే లేదు. ఇది నేను ఓ అన్న‌గా చెప్ప‌టం లేదు. త‌న‌ను ద‌గ్గ‌ర నుంచి చూసిన వ్య‌క్తిగా చెబుతున్నాను. త‌న గురించి తానెప్పుడూ ఆలోచించుకోడు. అంతెందుకు నిన్న మొన్న‌టి దాకా వాడికి సొంత ఇల్లు కూడా లేదు. మా అంద‌రికీ ఇళ్లున్నాయి. నువ్వు కూడా క‌ట్టుకో అని అంటే, చూద్దాం అని దాటేసేవాడు. వేళ‌కు అన్నం తిన‌డు, స‌రైన బ‌ట్ట‌లు వేసుకోడు. అన్నీ వ‌దిలేసిన యోగిలాంటివాడు. స‌మాజానికి ఏదైనా చేయాల‌నే త‌ప‌న‌తో ఉంటాడు.

త‌ను చిత్తశుద్ధి, నిజాయ‌తీతో రాజ‌కీయాల‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని అనుకుంటున్నాడు. రాజ‌కీయాల‌నే మురికిలోకి తాను దిగాడు. ఆ క్ర‌మంలో త‌న‌కు కూడా మురికి అంటుకుంది. మురికిని తీసేయాల‌నుకున్న వాళ్ల‌కు అది అంటుకుంటుంది క‌దా.. త‌ను స్వచ్ఛ‌మైన మ‌న‌సుతో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు మ‌నం తనకి స‌హ‌క‌రించాలి. ప్రోత్స‌హించాలి. ఇందులో కొంద‌రు ఆయ‌న్ని మితిమీరి మాట‌లు అంటున్న‌ప్పుడు బాధ వేస్తుంది. పైగా ప‌వ‌న్‌ని తిట్టిన వాళ్లు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి పెళ్లిళ్ల‌కు, పేరంటాల‌కు ర‌మ్మ‌ని బ‌తిమ‌లాడుతారు. నా త‌మ్ముడిని అన్ని మాట‌లన్న వారితోనే మ‌ళ్లీ మాట్లాడాల్సి వ‌స్తుందే.. నేను వెళ్లి వాళ్ళని కలవాల్సి వస్తుందని ఎన్నోసార్లు బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news