పెట్రోల్ లేదన్నందుకు దళిత యువకుడిపై వైసీపీ నేత దాడి..!

-

ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. పెట్రోల్ లేదన్నందుకు దళిత యువకుడిపై వైసీపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిన్న జరుగగా, ఈ వీడియో వైరల్‌ అయింది. అయితే, దీనిపై నారా లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. దళితులపై వైసిపి నేతల దమనకాండ కొనసాగుతూనే ఉందని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ కొట్టడం కుదరదు అన్నందుకు దళిత యువకుడు తేజపై అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశాడు బొడిగుడిపాడు వైసిపి ఎంపీటీసీ మహేష్ నాయుడని తెలిపారు లోకేష్‌.

కాళ్ళతో తన్ని, ఇనుప రాడ్డుతో తేజని తీవ్రంగా గాయపరిచారు. దళిత యువకుడుపై దాడి చేసిన ఎంపీటీసీ మహేష్ నాయుడు, అతని అనుచరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. గాయపడిన తేజకి మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news