బండ్లతోని, గుండ్లతోని అయ్యేదేం లేదు – రేవంత్ రెడ్డి

-

రాష్ట్రంలో బండ్లతోని, గుండ్లతోని అయ్యేదేం లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్ బోయినపల్లి లో గాంధీ ఐడియాలజీ సెంటర్లో పిసిసి ఆధ్వర్యంలో పార్టీ నేతలకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా తెలంగాణలో చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభయాన్ కార్యక్రమ ప్రణాళిక పై నేతలకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరంకుశ పాలను కొనసాగుతుందని మండిపడ్డారు. ఈ నిరంకుశ పరిస్థితుల నుంచి విముక్తి కల్పించేది కాంగ్రెస్ మాత్రమేనని.. బండ్లతో, గుండ్లతో అయ్యేది ఏమీ లేదన్నారు.

అధికారం కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. విభజించు, పాలించు విధానంతో ముందుకెళుతున్న బిజెపి పరిపాలనకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ జోఢోయాత్ర చేస్తున్నారని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news